ਗਾਵੈ ਕੋ ਵੇਖੈ ਹਾਦਰਾ ਹਦੂਰਿ ॥
ఆటను అన్నిచోట్లా కనిపిస్తాడని కొందరు పాడారు.
ਕਥਨਾ ਕਥੀ ਨ ਆਵੈ ਤੋਟਿ ॥
అతని లక్షణాలను వర్ణి౦చడానికి అ౦తమే లేదు.
ਕਥਿ ਕਥਿ ਕਥੀ ਕੋਟੀ ਕੋਟਿ ਕੋਟਿ ॥
మిలియన్ల మ౦ది ఆయనను మిలియన్ సార్లు వర్ణి౦చడానికి ప్రయత్ని౦చారు.
ਦੇਦਾ ਦੇ ਲੈਦੇ ਥਕਿ ਪਾਹਿ ॥
గొప్పగా ఇచ్చేవాడు ఎప్పుడూ ఇస్తూనే ఉంటాడు, అందుకునే వారు వాటిని అందుకుంటూ అలసిపోతున్నారు.
ਜੁਗਾ ਜੁਗੰਤਰਿ ਖਾਹੀ ਖਾਹਿ ॥
(అయినా) ప్రజలు ఎన్నో యుగాల నుండి అతని బహుమతులను వినియోగిస్తూనే ఉన్నారు.
ਹੁਕਮੀ ਹੁਕਮੁ ਚਲਾਏ ਰਾਹੁ ॥
ఇతను దేవుడు, గొప్ప అధినేత, తన ఆదేశంతో ప్రపంచ పనితీరును నిర్దేశిస్తున్నారు.
ਨਾਨਕ ਵਿਗਸੈ ਵੇਪਰਵਾਹੁ ॥੩॥
ఓ నానక్, అతను నిర్లక్ష్యమైన, క్షమి౦చే గుణం కలిగిన, ఎల్లప్పుడూ ఆన౦దకరమైన స్థితిలో ఉంటాడు.
ਸਾਚਾ ਸਾਹਿਬੁ ਸਾਚੁ ਨਾਇ ਭਾਖਿਆ ਭਾਉ ਅਪਾਰੁ ॥
ఆయన అమరుడు మరియు ఆయన న్యాయము, ఆయన భాష ప్రేమతో వస్తుంది మరియు ఆయన అనంతుడు.
ਆਖਹਿ ਮੰਗਹਿ ਦੇਹਿ ਦੇਹਿ ਦਾਤਿ ਕਰੇ ਦਾਤਾਰੁ ॥
మనము అతనిని చాలా ఎక్కువగా వేడుకుంటూ ఉంటాము మరియు ఆ దయగల దేవుడు అన్నిటినీ ఇస్తూనే ఉంటాడు.
ਫੇਰਿ ਕਿ ਅਗੈ ਰਖੀਐ ਜਿਤੁ ਦਿਸੈ ਦਰਬਾਰੁ ॥
అతనికి ఏమి అర్పించుకుంటే ఆ దేవుని స్థానానికి చేరుకోగలమో.
ਮੁਹੌ ਕਿ ਬੋਲਣੁ ਬੋਲੀਐ ਜਿਤੁ ਸੁਣਿ ਧਰੇ ਪਿਆਰੁ ॥
ఆయన ప్రేమను రేకెత్తి౦చడానికి మన౦ ఏ మాటలు మాట్లాడాలి?
ਅੰਮ੍ਰਿਤ ਵੇਲਾ ਸਚੁ ਨਾਉ ਵਡਿਆਈ ਵੀਚਾਰੁ ॥
ఉదయానికి ము౦దు ఉన్న పవిత్రమైన సమయంలో, సత్యనామాన్ని చదవండి, ఆయన మహిమగల సద్గుణాలను గుర్తించండి.
ਕਰਮੀ ਆਵੈ ਕਪੜਾ ਨਦਰੀ ਮੋਖੁ ਦੁਆਰੁ ॥
మానవ శరీరం మంచి పనుల చెయ్యటం ద్వారా దొరుకుతుంది, దుర్గుణాల నుండి విముక్తి ద్వారా పొందబడుతుంది మరియు మనము అతని ఆశీర్వాదంతో దైవిక న్యాయస్థానానికి చేరుకుంటాము.
ਨਾਨਕ ਏਵੈ ਜਾਣੀਐ ਸਭੁ ਆਪੇ ਸਚਿਆਰੁ ॥੪॥
ఓ’ నానక్, ఈ విధంగా మనం అతనిని గ్రహించగలం, ఎవరైతే స్వీయ ఉనికిలో ఉంటూ నిత్యముగా ఉంటాడో.
ਥਾਪਿਆ ਨ ਜਾਇ ਕੀਤਾ ਨ ਹੋਇ ॥
అతనిని స్థాపించడం కుదరదు (పరిమితం చేయబడ్డాడు), అతనిని సృష్టించలేము.
ਆਪੇ ਆਪਿ ਨਿਰੰਜਨੁ ਸੋਇ ॥
నిష్కల్మషుడైన దేవుడు అతనికతనే స్వయంగా ఉనికిలోనికి వచ్చాడు.
ਜਿਨਿ ਸੇਵਿਆ ਤਿਨਿ ਪਾਇਆ ਮਾਨੁ ॥
ప్రేమపూర్వక భక్తితో ఆయనను స్మరించుకున్న వాడు, ఆయన ఆస్థానంలో గౌరవాన్ని పొందుతాడు.
ਨਾਨਕ ਗਾਵੀਐ ਗੁਣੀ ਨਿਧਾਨੁ ॥
ఓ నానక్, ఆయన గీతాలను పాడుకుందాం, అతను సద్గుణాలకు నిధి.
ਗਾਵੀਐ ਸੁਣੀਐ ਮਨਿ ਰਖੀਐ ਭਾਉ ॥
ఆయన స్తుతిని పాడుతూ, వింటూ, ఆయన ప్రేమను మన హృదయ౦లో ప్రతిష్ఠి౦చుకు౦దా౦,
ਦੁਖੁ ਪਰਹਰਿ ਸੁਖੁ ਘਰਿ ਲੈ ਜਾਇ ॥
మన దుఃఖాన్ని పారద్రోలి శాంతి ని మరియు సౌకర్యాన్ని పొందుదాం.
ਗੁਰਮੁਖਿ ਨਾਦੰ ਗੁਰਮੁਖਿ ਵੇਦੰ ਗੁਰਮੁਖਿ ਰਹਿਆ ਸਮਾਈ ॥
గురుబోధల ద్వారా మనం దైవిక ధ్వనిని వింటాం, దైవజ్ఞానాన్ని పొందుతాము మరియు దేవుడు ప్రతిచోటా వ్యాప్తి చెందాడని గ్రహిస్తాం.
ਗੁਰੁ ਈਸਰੁ ਗੁਰੁ ਗੋਰਖੁ ਬਰਮਾ ਗੁਰੁ ਪਾਰਬਤੀ ਮਾਈ ॥
మనకు, గురువు స్వయంగానే అన్ని దేవుళ్ళు మరియు దేవతల లాగా ఉంటాడు.
ਜੇ ਹਉ ਜਾਣਾ ਆਖਾ ਨਾਹੀ ਕਹਣਾ ਕਥਨੁ ਨ ਜਾਈ ॥
నేను దేవుణ్ణి తెలుసుకున్నప్పటికీ, అతనిని నేను మాటల్లో వర్ణించలేను.
ਗੁਰਾ ਇਕ ਦੇਹਿ ਬੁਝਾਈ ॥
ఓ’ నా గురు, దయచేసి ఈ అవగాహనతో నన్ను ఆశీర్వదించండి:
ਸਭਨਾ ਜੀਆ ਕਾ ਇਕੁ ਦਾਤਾ ਸੋ ਮੈ ਵਿਸਰਿ ਨ ਜਾਈ ॥੫॥
అన్ని జీవులకు ఏకైక ప్రదాత అయిన మిమ్మల్ని నేను ఎన్నటికీ మరచిపోలేనని.
ਤੀਰਥਿ ਨਾਵਾ ਜੇ ਤਿਸੁ ਭਾਵਾ ਵਿਣੁ ਭਾਣੇ ਕਿ ਨਾਇ ਕਰੀ ॥
ఆయన సంతోషిస్తే తీర్థయాత్ర, ప్రక్షాళన స్నానం ఉపయోగకరంగా ఉంటాయి. ఆయనను ఆహ్లాదపరిచేలా చేయకు౦డా, ఈ ఆచారాలు ఎ౦త వరకు మ౦చివి?
ਜੇਤੀ ਸਿਰਠਿ ਉਪਾਈ ਵੇਖਾ ਵਿਣੁ ਕਰਮਾ ਕਿ ਮਿਲੈ ਲਈ ॥
ఆయన సృష్టించిన మొత్తం ప్రపంచిన్ని చూసినప్పుడు, (నేను గ్రహించాను) అతని ఆశీర్వాదం లేకుండా ఏమీ పొందలేము.
ਮਤਿ ਵਿਚਿ ਰਤਨ ਜਵਾਹਰ ਮਾਣਿਕ ਜੇ ਇਕ ਗੁਰ ਕੀ ਸਿਖ ਸੁਣੀ ॥
గురు బోధనలను ఒక్కసారి అయినా విన్నా మీ మనస్సు దివ్యజ్ఞానంతో సంపన్నమవుతుంది.
ਗੁਰਾ ਇਕ ਦੇਹਿ ਬੁਝਾਈ ॥
ఓ’ నా గురు, దయచేసి ఈ అవగాహనతో నన్ను ఆశీర్వదించండి;
ਸਭਨਾ ਜੀਆ ਕਾ ਇਕੁ ਦਾਤਾ ਸੋ ਮੈ ਵਿਸਰਿ ਨ ਜਾਈ ॥੬॥
అన్ని జీవులకు ఏకైక ప్రదాత అయిన మిమ్మల్ని నేను ఎప్పటికీ మరచిపోలేను
ਜੇ ਜੁਗ ਚਾਰੇ ਆਰਜਾ ਹੋਰ ਦਸੂਣੀ ਹੋਇ ॥
ఒక వ్యక్తి నాలుగు యుగాలు లేదా పది రెట్లు ఎక్కువ జీవించినా,
ਨਵਾ ਖੰਡਾ ਵਿਚਿ ਜਾਣੀਐ ਨਾਲਿ ਚਲੈ ਸਭੁ ਕੋਇ ॥
అతడు ప్రపంచమంతట తెలిసినా, ప్రతివాడు అతనిని పాటించినా
ਚੰਗਾ ਨਾਉ ਰਖਾਇ ਕੈ ਜਸੁ ਕੀਰਤਿ ਜਗਿ ਲੇਇ ॥
ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు మరియు కీర్తితో మంచి పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్నా,
ਜੇ ਤਿਸੁ ਨਦਰਿ ਨ ਆਵਈ ਤ ਵਾਤ ਨ ਪੁਛੈ ਕੇ ॥
దేవుని కృప యొక్క దయ సాధించబడకపోతే, అప్పుడు ప్రపంచంలో ఈ సుదీర్ఘ జీవితం మరియు ఖ్యాతి విలువలేనిదే.
ਕੀਟਾ ਅੰਦਰਿ ਕੀਟੁ ਕਰਿ ਦੋਸੀ ਦੋਸੁ ਧਰੇ ॥
అటువంటి వ్యక్తి చాలా తక్కువగా పరిగణించబడతాడు, (అల్పమైన పురుగులాగా) మరియు నామాన్ని మరచిపోయినందుకు దేవుడు చేత తిరస్కరణకు గురవుతాడు.
ਨਾਨਕ ਨਿਰਗੁਣਿ ਗੁਣੁ ਕਰੇ ਗੁਣਵੰਤਿਆ ਗੁਣੁ ਦੇ ॥
ఓ నానక్, దేవుడు అయోగ్యులను కూడా సద్గుణాలతో ఆశీర్వదించగలడు, మరియు పుణ్యవంతులకు మరిన్ని సుగుణాలను ఇస్తాడు.
ਤੇਹਾ ਕੋਇ ਨ ਸੁਝਈ ਜਿ ਤਿਸੁ ਗੁਣੁ ਕੋਇ ਕਰੇ ॥੭॥
ఏమీ లేనివాడికి సద్గుణాలను ప్రసాదించగల దేవుడిని తప్ప మరెవరినీ నేను ఊహించుకోలేను.
ਸੁਣਿਐ ਸਿਧ ਪੀਰ ਸੁਰਿ ਨਾਥ ॥
దేవుని వాక్యాన్ని ప్రేమతో, భక్తితో వినడం ద్వారా ఒక వ్యక్తి సాధువుగా, మత మార్గదర్శిగా, ఆధ్యాత్మిక నాయకుడిగా, మరియు ఒక గొప్ప యోగిగా మారతాడు.
ਸੁਣਿਐ ਧਰਤਿ ਧਵਲ ਆਕਾਸ ॥
దేవుని వాక్యాన్ని ప్రేమతో, భక్తితో వినడం ద్వారా విశ్వ ప్రకృతిని, దాని సహాయ వ్యవస్థను అర్థం చేసుకుంటారు
ਸੁਣਿਐ ਦੀਪ ਲੋਅ ਪਾਤਾਲ ॥
దేవుని వాక్యాన్ని వినడ౦ ద్వారా, ఖండాల గురి౦చి, లోకుల గురి౦చి, వేరే ప్రా౦తాల గురి౦చి జ్ఞాన౦ లభిస్తుంది.
ਸੁਣਿਐ ਪੋਹਿ ਨ ਸਕੈ ਕਾਲੁ ॥
దేవుని వాక్యాన్ని వినడ౦ ద్వారా ఒకడు మరణ౦ గురి౦చి అస్సలు భయపడడు.
ਨਾਨਕ ਭਗਤਾ ਸਦਾ ਵਿਗਾਸੁ ॥
ఓ నానక్, ఆయన భక్తులు ఎప్పటికీ సంతోషం మరియు ఆనందంలో ఉంటారు.
ਸੁਣਿਐ ਦੂਖ ਪਾਪ ਕਾ ਨਾਸੁ ॥੮॥
దేవుని వాక్యాన్ని వినటం ద్వారా, అన్ని బాధలు మరియు పాపాలు తుడిచివేయబడతాయి. ||8||
ਸੁਣਿਐ ਈਸਰੁ ਬਰਮਾ ਇੰਦੁ ॥
దేవుని వాక్యమును వినుట వలన శివుడు, బ్రహ్మ, ఇంద్రుల వంటి దైవిక గుణాలను పొందుతారు.
ਸੁਣਿਐ ਮੁਖਿ ਸਾਲਾਹਣ ਮੰਦੁ ॥
దేవుని వాక్యాన్ని వినడ౦ ద్వారా పాపులు కూడా జ్ఞానోదయ౦ పొ౦దుతారు, దేవుని స్తుతిని పాడడ౦ ప్రార౦భిస్తారు.
ਸੁਣਿਐ ਜੋਗ ਜੁਗਤਿ ਤਨਿ ਭੇਦ ॥
దేవుని వాక్యాన్ని వినడ౦ ద్వారా, దేవునితో స౦ఘాన్ని సాధి౦చే విధాన౦ గురి౦చి, మానవ శరీర ఇంద్రియాలు ఎలా పనిచేస్తాయనే విషయాన్ని, వాటిని సరిగ్గా ఉపయోగి౦చడ౦ ద్వారా దేవునితో ఐక్యమయ్యే కళను నేర్చుకుంటారు.
ਸੁਣਿਐ ਸਾਸਤ ਸਿਮ੍ਰਿਤਿ ਵੇਦ ॥
దేవుని నామాన్ని వినడ౦ ద్వారా ఒకడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని (పరిశుద్ధ గ్రంథాల జ్ఞానాన్ని) పొ౦దుతాడు.
ਨਾਨਕ ਭਗਤਾ ਸਦਾ ਵਿਗਾਸੁ ॥
ఓ’ నానక్, భక్తులు ఎప్పటికీ ఆనందంలో ఉంటారు.