ਸੁਣਿਐ ਦੂਖ ਪਾਪ ਕਾ ਨਾਸੁ ॥੯॥
దేవుని నామమును ప్రేమపూర్వక భక్తితో వినడ౦ ద్వారా అన్ని బాధలు, పాపాలు నిర్మూలించబడతాయి
ਸੁਣਿਐ ਸਤੁ ਸੰਤੋਖੁ ਗਿਆਨੁ ॥
దేవుని నామాన్ని శ్రద్ధగా వినడ౦ ద్వారా ఒకడు సత్య౦, స౦తృప్తి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని స౦పాది౦చుకు౦టారు.
ਸੁਣਿਐ ਅਠਸਠਿ ਕਾ ਇਸਨਾਨੁ ॥
దేవుని నామాన్ని ప్రేమపూర్వక భక్తితో వినడం ద్వారా, అరవై ఎనిమిది సంప్రదాయ పవిత్ర స్థలాల్లో స్నానం చేసిన భక్తిపరులలాగా అవుతారు.
ਸੁਣਿਐ ਪੜਿ ਪੜਿ ਪਾਵਹਿ ਮਾਨੁ ॥
ప్రేమపూర్వకమైన భక్తితో దేవుని స్తుతిని వినడ౦ ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానపు పుస్తకాలను చదవితే వచ్చేంత నిజమైన గౌరవాన్ని సంపాదిస్తాడు.
ਸੁਣਿਐ ਲਾਗੈ ਸਹਜਿ ਧਿਆਨੁ ॥
ఆయన స్తుతిలను వినడ౦ ద్వారా, మనస్సు కష్టం లేకుండా ధ్యానానికి అనుగుణ౦గా మారుతుంది
ਨਾਨਕ ਭਗਤਾ ਸਦਾ ਵਿਗਾਸੁ ॥
ఓ’ నానక్, దేవుని భక్తులు ఎప్పటికీ సంతోషం మరియు ఆనంద స్థితిలో ఉంటారు.
ਸੁਣਿਐ ਦੂਖ ਪਾਪ ਕਾ ਨਾਸੁ ॥੧੦॥
ఆయన నామాన్ని ప్రేమపూర్వక భక్తితో వినడం వల్ల అన్ని దుఃఖాలు మరియు పాపాలు తుడిచివేయబడతాయి.
ਸੁਣਿਐ ਸਰਾ ਗੁਣਾ ਕੇ ਗਾਹ ॥
దేవుని స్తుతులను వినడ౦ ద్వారా, ఒకరు ఎ౦తో సద్గుణవంతులు అవుతారు.
ਸੁਣਿਐ ਸੇਖ ਪੀਰ ਪਾਤਿਸਾਹ ॥
దేవుని నామాన్ని ప్రేమపూర్వక భక్తితో వినడం ద్వారా సామాజిక మత నాయకులు మరియు చక్రవర్తుల వంటి ప్రతిష్టాత్మక హోదాను పొందుతారు.
ਸੁਣਿਐ ਅੰਧੇ ਪਾਵਹਿ ਰਾਹੁ ॥
ఆయన స్తుతిని వినడ౦ ద్వారా ఆధ్యాత్మిక అజ్ఞాని కూడా రక్షణ మార్గాన్ని కనుక్కుంటాడు.
ਸੁਣਿਐ ਹਾਥ ਹੋਵੈ ਅਸਗਾਹੁ ॥
దేవుని పేరుని వినడ౦ ద్వారా, దుర్గుణాల యొక్క లోకసముద్ర రహస్యాలను అర్థ౦ అవుతాయి.
ਨਾਨਕ ਭਗਤਾ ਸਦਾ ਵਿਗਾਸੁ ॥
ఓ నానక్, దేవుని భక్తులు ఎప్పటికీ సంతోషం మరియు ఆనంద స్థితిలో ఉంటారు.
ਸੁਣਿਐ ਦੂਖ ਪਾਪ ਕਾ ਨਾਸੁ ॥੧੧॥
ఆయన స్తుతులను వినటం ద్వారా అన్ని దుఃఖాలు, పాపాలు తుడిచివేయబడతాయి.
ਮੰਨੇ ਕੀ ਗਤਿ ਕਹੀ ਨ ਜਾਇ ॥
దేవునిపై నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉన్న వారి మానసిక స్థితిని వర్ణించలేము.
ਜੇ ਕੋ ਕਹੈ ਪਿਛੈ ਪਛੁਤਾਇ ॥
దీనిని వర్ణించడానికి ప్రయత్నించే వ్యక్తి తర్వాత చింతించాల్సి ఉంటుంది.
ਕਾਗਦਿ ਕਲਮ ਨ ਲਿਖਣਹਾਰੁ ॥
దేవునిపట్ల నిజమైన విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక మానసిక స్థితి గురించి ఎవరూ వర్ణించలేరు,
ਮੰਨੇ ਕਾ ਬਹਿ ਕਰਨਿ ਵੀਚਾਰੁ ॥
కొంతమంది ఏవిధంగానైనా దానిపై ప్రతిబింబిస్తారు.
ਐਸਾ ਨਾਮੁ ਨਿਰੰਜਨੁ ਹੋਇ ॥
అవును, నిష్కల్మషమైన నామం యొక్క సుగుణాలు అలాంటివి,
ਜੇ ਕੋ ਮੰਨਿ ਜਾਣੈ ਮਨਿ ਕੋਇ ॥੧੨॥
దానిని నిజంగా నమ్మి దానికి అనుగుణంగా జీవించే వ్యక్తి ద్వారా మాత్రమే గ్రహించబడుతుంది.
ਮੰਨੈ ਸੁਰਤਿ ਹੋਵੈ ਮਨਿ ਬੁਧਿ ॥
దేవునిలో నిజమైన విశ్వాసి యొక్క మనస్సు మరియు తెలివితేటలు ఆధ్యాత్మికంగా జ్ఞానోదయం అవుతాయి.
ਮੰਨੈ ਸਗਲ ਭਵਣ ਕੀ ਸੁਧਿ ॥
దేవునిపై పూర్తి విశ్వాసం కలిగి ఉండటం వల్ల ప్రపంచం మరియు రాజ్యం గురించి జ్ఞానం కలుగుతుంది. (దేవుడు ప్రతిచోటా ఉన్నాడు
ਮੰਨੈ ਮੁਹਿ ਚੋਟਾ ਨਾ ਖਾਇ ॥
దేవునిపై పూర్తి విశ్వాస౦ కలిగి ఉ౦డడ౦ ద్వారా, లోక౦లో చెడు వల్ల కలిగే బాధను అనుభవి౦చరు.
ਮੰਨੈ ਜਮ ਕੈ ਸਾਥਿ ਨ ਜਾਇ ॥
దేవునిపై పూర్తి విశ్వాస౦ కలిగివు౦డడ౦ ద్వారా మరణరాక్షసుణ్ణి ఎదుర్కోవలసిన అవసరం ఉండదు.
ਐਸਾ ਨਾਮੁ ਨਿਰੰਜਨੁ ਹੋਇ ॥
అవును, నిష్కల్మషమైన దేవుని సద్గుణాలు అలాంటివే,
ਜੇ ਕੋ ਮੰਨਿ ਜਾਣੈ ਮਨਿ ਕੋਇ ॥੧੩॥
దానిని నిజంగా నమ్మి దానికి అనుగుణంగా జీవించే వ్యక్తికి మాత్రమే దొరుకుతుంది.
ਮੰਨੈ ਮਾਰਗਿ ਠਾਕ ਨ ਪਾਇ ॥
నమ్మకస్థుల ఆధ్యాత్మిక మార్గం ఎప్పుడు అడ్డుకోబడదు.
ਮੰਨੈ ਪਤਿ ਸਿਉ ਪਰਗਟੁ ਜਾਇ ॥
నమ్మకస్థులు గౌరవ౦తో, మరియు పేరుప్రఖ్యాతలతో వెళ్ళవచ్చు.
ਮੰਨੈ ਮਗੁ ਨ ਚਲੈ ਪੰਥੁ ॥
నమ్మకస్థులు వట్టి మత ఆచారాలను పాటించరు.
ਮੰਨੈ ਧਰਮ ਸੇਤੀ ਸਨਬੰਧੁ ॥
నమ్మకస్థులు సత్యానికి, నీతికి (ధర్మానికి) బాగా కట్టుబడి ఉంటారు.
ਐਸਾ ਨਾਮੁ ਨਿਰੰਜਨੁ ਹੋਇ ॥
అవును, నిష్కల్మషమైన దేవుని సద్గుణాలు అలాంటివే,
ਜੇ ਕੋ ਮੰਨਿ ਜਾਣੈ ਮਨਿ ਕੋਇ ॥੧੪॥
దానిని నిజంగా విశ్వసించి అనుగుణంగా జీవించే వ్యక్తికి మాత్రమే దక్కుతుంది.
ਮੰਨੈ ਪਾਵਹਿ ਮੋਖੁ ਦੁਆਰੁ ॥
దేవునిపట్ల నిజమైన విశ్వాసం ఉన్న వ్యక్తి, లోకాల అనుబంధాల ను౦డి (అబద్ధ౦) స్వేచ్ఛను సంపాదిస్తాడు.
ਮੰਨੈ ਪਰਵਾਰੈ ਸਾਧਾਰੁ ॥
దేవునిపై నిజమైన విశ్వాసం కలిగిన వ్యక్తి, మొత్తం కుటుంబాన్ని దేవునితో అనుసంధానించడానికి మార్గం సుగమం చేస్తాడు.
ਮੰਨੈ ਤਰੈ ਤਾਰੇ ਗੁਰੁ ਸਿਖ ॥
అటువంటి విశ్వాసం కలిగిన తనని తాను రక్షి౦చుకోవడమే కాక ఇతర గురు శిష్యులను కూడా రక్షిస్తాడు.
ਮੰਨੈ ਨਾਨਕ ਭਵਹਿ ਨ ਭਿਖ ॥
ఓ’ నానక్, నామాన్ని విశ్వాసించే వాడు ఎవరిని సహాయం కోసం వేడడు.
ਐਸਾ ਨਾਮੁ ਨਿਰੰਜਨੁ ਹੋਇ ॥
అవును, నిష్కల్మషమైన దేవుని సద్గుణాలు అలాంటివే,
ਜੇ ਕੋ ਮੰਨਿ ਜਾਣੈ ਮਨਿ ਕੋਇ ॥੧੫॥
దానిని నిజంగా విశ్వసించి దానికి అనుగుణంగా జీవించే వ్యక్తి ద్వారా మాత్రమే గ్రహించబడింది.
ਪੰਚ ਪਰਵਾਣ ਪੰਚ ਪਰਧਾਨੁ ॥
దేవుని నామాన్ని విని, విధేయత చూపేవారు పంచులు (దేవుని ఆమోదము) మరియు నాయకులు అవుతారు.
ਪੰਚੇ ਪਾਵਹਿ ਦਰਗਹਿ ਮਾਨੁ ॥
ఈ ఆమోదితమైనవారు దేవుని ఆస్థాన౦లో గౌరవి౦చబడతారు
ਪੰਚੇ ਸੋਹਹਿ ਦਰਿ ਰਾਜਾਨੁ ॥
వీరు రాజులకే రాజైన దేవుని ఆస్థానాన్ని అనుగ్రహిస్తారు.
ਪੰਚਾ ਕਾ ਗੁਰੁ ਏਕੁ ਧਿਆਨੁ ॥
వారి మనస్సులు ఎల్లప్పుడూ దైవిక పదానికి ముడిపడి ఉంటాయి.
ਜੇ ਕੋ ਕਹੈ ਕਰੈ ਵੀਚਾਰੁ ॥
వివరించడానికి మరియు చెప్పటానికి ఎవరు ఎంత ప్రయత్నించినా,
ਕਰਤੇ ਕੈ ਕਰਣੈ ਨਾਹੀ ਸੁਮਾਰੁ ॥
సృష్టికర్త చర్యలను అర్థం చేసుకోలేము
ਧੌਲੁ ਧਰਮੁ ਦਇਆ ਕਾ ਪੂਤੁ ॥
నీతి అనేది ప్రపంచానికి సహాయం చేసే శక్తి (ధౌల్-పౌరాణిక ఎద్దు) మరియు నీతి కరుణ నుండి వెలువడుతుంది.
ਸੰਤੋਖੁ ਥਾਪਿ ਰਖਿਆ ਜਿਨਿ ਸੂਤਿ ॥
కరుణ, నీతి మరియు సహనం ఆధారంగా ధర్మం (దేవుని నియమం) ఈ భూమికి సహాయం చేస్తాయి.
ਜੇ ਕੋ ਬੁਝੈ ਹੋਵੈ ਸਚਿਆਰੁ ॥
ఈ భావనను అర్థం చేసుకున్నట్లయితే, అతడు నిజమైన సత్యాన్ని తెలుసుకుంటాడు,
ਧਵਲੈ ਉਪਰਿ ਕੇਤਾ ਭਾਰੁ ॥
దేవుని ధర్మశాస్త్రమే విశ్వాన్ని సమతూకంలో ఉంచుతుంది, ఎద్దు కాదు.
ਧਰਤੀ ਹੋਰੁ ਪਰੈ ਹੋਰੁ ਹੋਰੁ ॥
ఈ ప్రపంచానికి మించిన అనేక ప్రపంచాలు ఉన్నాయి -చాలా!
ਤਿਸ ਤੇ ਭਾਰੁ ਤਲੈ ਕਵਣੁ ਜੋਰੁ ॥
ఏ శక్తి వారిని పట్టి ఉంచుతుంది, మరియు వారి బరువుకు సహాయం చేస్తుంది?
ਜੀਅ ਜਾਤਿ ਰੰਗਾ ਕੇ ਨਾਵ ॥
వివిధ రంగులు మరియు పేర్లతో లెక్కలేనన్ని జాతుల జీవులు ఉన్నాయి,
ਸਭਨਾ ਲਿਖਿਆ ਵੁੜੀ ਕਲਾਮ ॥
దేవుని యొక్క నిత్యము ప్రవహి౦చే కలం అ౦దరి రాతలను వ్రాసి౦ది.
ਏਹੁ ਲੇਖਾ ਲਿਖਿ ਜਾਣੈ ਕੋਇ ॥
ఈ ఖాతాను ఎలా రాయాలో ఆ అరుదైన వ్యక్తికి మాత్రమే తెలుసు.
ਲੇਖਾ ਲਿਖਿਆ ਕੇਤਾ ਹੋਇ ॥
అది ఎంత పెద్దదాన్ని తీసుకుంటుందో ఊహించండి!
ਕੇਤਾ ਤਾਣੁ ਸੁਆਲਿਹੁ ਰੂਪੁ ॥
ఎలాంటి శక్తి! ఎంత మనోహరమైన అందం! (ప్రకృతి యొక్క)
ਕੇਤੀ ਦਾਤਿ ਜਾਣੈ ਕੌਣੁ ਕੂਤੁ ॥
మరియు ఎలాంటి బహుమతులు! (ప్రకృతి యొక్క బహుమతులు) వారి పరిధిని ఎవరు తెలుసుకోగలరు?
ਕੀਤਾ ਪਸਾਉ ਏਕੋ ਕਵਾਉ ॥
విస్తారమైన విశ్వం యొక్క విస్తీర్ణము ఒక పదంతో (ఆయనచేత) సృష్టించబడింది!
ਤਿਸ ਤੇ ਹੋਏ ਲਖ ਦਰੀਆਉ ॥
దాని నుండి విశ్వాన్ని నడపడానికి లక్షలాది జీవితాలు మరియు వ్యవస్థలు ఉద్భవించాయి.
ਕੁਦਰਤਿ ਕਵਣ ਕਹਾ ਵੀਚਾਰੁ ॥
ఈ ప్రక్రుతి యొక్క విస్తృతి గురించి ఆలోచనలను వ్యక్తీకరించడానికి నేను ఎవరిని?
ਵਾਰਿਆ ਨ ਜਾਵਾ ਏਕ ਵਾਰ ॥
నేను చాలా శక్తిహీనుడను, నీ కోసం ఒకసారి అయినా నన్ను నేను త్యాగం చేసుకోడానికి కూడా నేను అర్హుడిని కాదు.
ਜੋ ਤੁਧੁ ਭਾਵੈ ਸਾਈ ਭਲੀ ਕਾਰ ॥
ఓ’ దేవుడా, మీకు ఏది సంతోషాన్నిస్తో౦దో అది మాకు మంచిది.
ਤੂ ਸਦਾ ਸਲਾਮਤਿ ਨਿਰੰਕਾਰ ॥੧੬॥
ఓ దేవుడా, మీరు శాశ్వతమైన మరియు అపరిమితమైన వారు.
ਅਸੰਖ ਜਪ ਅਸੰਖ ਭਾਉ ॥
లెక్కలేనంత మంది, మీ పేరును ధ్యానిస్తారు మరియు ప్రేమతో మిమ్మల్ని గుర్తుంచుకుంటారు.
ਅਸੰਖ ਪੂਜਾ ਅਸੰਖ ਤਪ ਤਾਉ ॥
మిమ్మల్ని ఆరాధించేవారు, కఠినమైన క్రమశిక్షణలు పాటించేవారు లెక్కలేనంత మంది.
ਅਸੰਖ ਗਰੰਥ ਮੁਖਿ ਵੇਦ ਪਾਠ ॥
పవిత్ర పుస్తకాలను చదివేవారు లెక్కలేనంత మంది.
ਅਸੰਖ ਜੋਗ ਮਨਿ ਰਹਹਿ ਉਦਾਸ ॥
యోగులు లెక్కలేనంత మంది, వారి మనస్సులు ప్రపంచం నుండి వేరుచేయబడ్డాయి.