Telugu Page 1

ੴ ਸਤਿ ਨਾਮੁ ਕਰਤਾ ਪੁਰਖੁ ਨਿਰਭਉ ਨਿਰਵੈਰੁ ਅਕਾਲ ਮੂਰਤਿ ਅਜੂਨੀ ਸੈਭੰ ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు అతనే ‘శాశ్వత మైన ఉనికి’. అతనే విశ్వాన్ని సృష్టించిన కర్త, అంతటా-ఉండే, భయం లేకుండా, శత్రుత్వం లేకుండా, కాలం నుండి స్వతంత్రంగా, జనన మరియు మరణ చక్రాలకి మించి మరియు స్వీయ బహిర్గతుడు. గురువు కృపవల్ల ఆయన సాక్షాత్కారం చెందబడ్డాడు. 

॥ ਜਪੁ ॥
ఈ కూర్పు యొక్క పేరు ‘జాప్’

ਆਦਿ ਸਚੁ ਜੁਗਾਦਿ ਸਚੁ ॥
అతను మొదటి నుండే ఉనికిలో ఉన్నాడు, యగాలంతా నిజంగానే.

ਹੈ ਭੀ ਸਚੁ ਨਾਨਕ ਹੋਸੀ ਭੀ ਸਚੁ ॥੧॥
ఓ’ నానక్, అతను ఇప్పుడు నిజమైనవాడు, అతను ఎప్పటికీ నిజమైనవాడే  (ఉనికిలో ఉంటాడు). 

ਸੋਚੈ ਸੋਚਿ ਨ ਹੋਵਈ ਜੇ ਸੋਚੀ ਲਖ ਵਾਰ ॥
ఒకవేళ ఎవరన్నా వేలాది స్నానాలు చేసినా మనస్సు స్వచ్ఛంగా మారదు.

ਚੁਪੈ ਚੁਪ ਨ ਹੋਵਈ ਜੇ ਲਾਇ ਰਹਾ ਲਿਵ ਤਾਰ ॥
నిరంతరం ఆచారబద్ధమైన ధ్యానం చేసినా కూడా మనస్సు మౌనంగా ఉండి తిరగటాన్ని ఆపదు. 

ਭੁਖਿਆ ਭੁਖ ਨ ਉਤਰੀ ਜੇ ਬੰਨਾ ਪੁਰੀਆ ਭਾਰ ॥
అన్ని గ్రహాల భౌతిక సంపదను సేకరించైనా తర్వాత కూడా ఆకలి లేదా భౌతిక సంపద కోసం కలిగే కోరికను సంతృప్తి పరచలేదు. 

ਸਹਸ ਸਿਆਣਪਾ ਲਖ ਹੋਹਿ ਤ ਇਕ ਨ ਚਲੈ ਨਾਲਿ 
అత్యంత తెలివి మరియు జ్ఞానం కలిగి ఉండటంతో చివరికి వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు. 

ਕਿਵ ਸਚਿਆਰਾ ਹੋਈਐ ਕਿਵ ਕੂੜੈ ਤੁਟੈ ਪਾਲਿ ॥
కాబట్టి మన౦ సత్య౦గా ఎలా మారవచ్చు? భ్రమ యొక్క ముసుగును (దేవుని నుండి మనల్ని వేరు చేసేది) ఎలా చీల్చెయ్యవచ్చు?   

ਹੁਕਮਿ ਰਜਾਈ ਚਲਣਾ ਨਾਨਕ ਲਿਖਿਆ ਨਾਲਿ ॥੧॥
ఓ నానక్, మీకు నిర్దేశించినదాన్ని అంగీకరిస్తూ మరియు దేవుని చిత్తం ప్రకారం జీవించడం ద్వారా.                   

ਹੁਕਮੀ ਹੋਵਨਿ ਆਕਾਰ ਹੁਕਮੁ ਨ ਕਹਿਆ ਜਾਈ ॥
ప్రతిదీ అతని ఆదేశం తోనే సృష్టించబడింది; అతని ఆజ్ఞను వివరించలేము. 

ਹੁਕਮੀ ਹੋਵਨਿ ਜੀਅ ਹੁਕਮਿ ਮਿਲੈ ਵਡਿਆਈ ॥
అతని ఆజ్ఞతో ఆత్మలు జీవాన్ని పూసుకుంటాయి; ఆయన ఆజ్ఞతోనే మహిమ, గొప్పతనము లభిస్తాయి. 

ਹੁਕਮੀ ਉਤਮੁ ਨੀਚੁ ਹੁਕਮਿ ਲਿਖਿ ਦੁਖ ਸੁਖ ਪਾਈਅਹਿ ॥
అతని సంకల్పంతో కొందరు ఉన్నతంగా మరికొందరు తక్కువ నిలుస్తారు. ఆయన సంకల్పంతోనే నిర్దేశించిన దాని వల్ల బాధలు, ఆనందాలు అనుభవిస్తారు.  

ਇਕਨਾ ਹੁਕਮੀ ਬਖਸੀਸ ਇਕਿ ਹੁਕਮੀ ਸਦਾ ਭਵਾਈਅਹਿ ॥
కొందరు, ఆయన ఆజ్ఞతో, ఆశీర్వదింపబడి మరియు క్షమించబడతారు; మరికొ౦దరు, ఆయన ఆజ్ఞతో, జనన మరణాల చక్ర౦లో లక్ష్యాలు లేకుండా తిరుగుతారు ఉంటారు. 

ਹੁਕਮੈ ਅੰਦਰਿ ਸਭੁ ਕੋ ਬਾਹਰਿ ਹੁਕਮ ਨ ਕੋਇ ॥
ప్రతి ఒక్కరూ ఆయన ఆజ్ఞకు లోబడి ఉంటారు; ఎవరూ ఆయన ఆజ్ఞను దాటి లేరు.

ਨਾਨਕ ਹੁਕਮੈ ਜੇ ਬੁਝੈ ਤ ਹਉਮੈ ਕਹੈ ਨ ਕੋਇ ॥੨॥
ఓ నానక్, అతని ఆజ్ఞను ఎవరైతే అర్థం చేసుకుంటారో, వారు అహంభావ౦తో ప్రవర్తి౦చకూడదు.

ਗਾਵੈ ਕੋ ਤਾਣੁ ਹੋਵੈ ਕਿਸੈ ਤਾਣੁ ॥
అతని సామర్థ్య౦ ప్రకార౦, కొ౦దరు ఆయన శక్తిని పాడుతూ ఉండొచ్చు.

ਗਾਵੈ ਕੋ ਦਾਤਿ ਜਾਣੈ ਨੀਸਾਣੁ ॥
కొ౦దరు ఆయన మనకు ఇచ్చే బహుమతుల గురి౦చి పాడుతారు (మన౦ వినియోగి౦చినవన్నీ) మరియు ఆ బహుమతులను చూసుకుని ఆయన ఉన్నారనే రుజువు చేసుకుంటారు. 

ਗਾਵੈ ਕੋ ਗੁਣ ਵਡਿਆਈਆ ਚਾਰ ॥
కొందరు ఆయన ఉదాత్తమైన సద్గుణాలను మరియు ఆయన గొప్పతనాన్ని పాడుతారు.

ਗਾਵੈ ਕੋ ਵਿਦਿਆ ਵਿਖਮੁ ਵੀਚਾਰੁ ॥
కొ౦దరు ఆయన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పాడడ౦ కష్ట౦గా ఉ౦టు౦దని అనుకుంటారు. 

ਗਾਵੈ ਕੋ ਸਾਜਿ ਕਰੇ ਤਨੁ ਖੇਹ ॥   
కొందరు అతను శరీరాన్ని అందంగా తయారు చేస్తాడని, మళ్ళీ దానిని ధూళిగా మార్చేస్తాడని పాడుతారు.     

ਗਾਵੈ ਕੋ ਜੀਅ ਲੈ ਫਿਰਿ ਦੇਹ ॥
కొ౦దరు ఆయన ప్రాణాలను తీసేస్తాడని, ఆ తర్వాత మళ్ళీ పట్టిస్తాడని పాడుతారు.

ਗਾਵੈ ਕੋ ਜਾਪੈ ਦਿਸੈ ਦੂਰਿ ॥
అతను చాలా దూరంలో ఉంటాడని కొందరు పాడుతారు.                                                                           

error: Content is protected !!